సోమేశ్వరాలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ అధికారులు

63చూసినవారు
సోమేశ్వరాలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ అధికారులు
ఆత్మకూరు ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు అనంతసాగరం మండలంలోని సోమశిల సోమేశ్వరాలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు బుధవారం సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణం, స్థితిగతులు, ఆలయానికి సంబంధించిన ప్లాన్, ఎస్టిమేషన్ వేశారు. ఆ పత్రాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్