మంత్రి నారా లోకేష్ కు విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలకు ఆహ్వానం అందింది. దేవదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ అర్చకులు తో కలిసి వెళ్లి సోమవారం లోకేష్ కు అమ్మవారి పట్టు వస్త్రాలు అందజేసి ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారిగా వస్తున్న ఉత్సవాలను వైభవంగా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని లోకేష్ తెలిపారు.