ఆత్మకూరు నియోజకవర్గం వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు

79చూసినవారు
ఆత్మకూరు నియోజకవర్గం వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని మర్రిపాడు, సంఘం, అనంతసాగరం, చేజర్ల మండలాల్లోని శ్రీ శిరిడి సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు వందలాదిగా తరలివచ్చి సాయిబాబాకు మొక్కులు సమర్పించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఎక్కడ చూసినా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల కొరకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్