నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయం వద్ద అక్రమంగా చేపలు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని చేపలతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఓ బడా వ్యాపారస్తుడికి చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. మత్స్యశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. జలాశయంలో అక్రమంగా చేపలు తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.