మర్రిపాడు: 10 ఎర్రచందనం తుంగలు స్వాధీనం

66చూసినవారు
మర్రిపాడు: 10 ఎర్రచందనం తుంగలు స్వాధీనం
జిల్లాలోని మర్రిపాడు మండలం సింగనపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం తుంగలను తరలిస్తున్నారన్న పక్కా సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న పది ఎర్రచందనం తుంగలను అదుపులోకి తీసుకున్నారు. వాటిని ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. అలాగే అటవీ ప్రాంతంలో ఎర్రచందనం నరికినా, రవాణాకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్