నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డిసిపల్లి పొగాకు వేలం కేంద్రంలో శనివారం జరిగిన పొగాకు వేలంలో 224 పొగాకు బేళ్లను వ్యాపారాలు వివిధ కారణాలతో తిరస్కరించారు. వేలం నిర్వహణ కేంద్రానికి మొత్తం రైతులు 741 బేళ్లను అమ్మకానికి తీసుకువచ్చారు. వీటిలో 517 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేసి, 224 బేళ్లను తిరస్కరించారు.