శనివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మర్రిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రెండవ సంవత్సరం సీఈసీ గ్రూపులో కే. అనిత 944 మార్కులు సాధించారు. అలాగే అదే గ్రూపులో మరో విద్యార్థిని సిహెచ్. లక్ష్మీప్రసన్న 841 మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ స్థాయిలో మార్కులు సాధించడంతో కళాశాల అధ్యాపకులు, కుటుంబ సభ్యులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.