వేరే రాష్ట్రం కేసును మర్రిపాడు పోలీసులు చేదించిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంట పది రోజుల క్రితం బెంగళూరు నుంచి పారిపోయారు. యువతీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సాంకేతికత ఆధారంగా యువతి, యువకుడు మర్రిపాడు మండలం డిసిపల్లిలో ఉన్నట్లు గుర్తించి ఇక్కడ పోలీసులను ఆశ్రయించారు. మర్రిపాడు పోలీసులు వెతికి పట్టుకొని బెంగళూరు పోలీసులకు అప్పగించారు.