మర్రిపాడు మండ పరిధిలోని పడమటి నాయుడు పల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. చిరుధాన్యాల గురించి పోషణ గురించి గర్భిణీలకు, యుక్త వయస్సు మహిళలకు, బాలికలకు, అంగన్వాడీ టీచర్లు మన్నే పద్మమ్మ, నాగమ్మ, జాన్సీ, రాజేశ్వరి, కృష్ణవేణి, సుమలత అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా స్థానిక ప్రాథమికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బయ్య పాల్గొన్నారు.