నెల్లూరు జిల్లాలో అనుమానాస్పదంగా కారులో ఉన్న నగదును పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కారులో సుమారు రూ.3 కోట్ల నగదు ఉందని, దానిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి అటవీ ప్రాంతంలో కారును గుర్తించినట్లు తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అయితే ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.