వాటర్ ప్లాంట్ ను దుకాణంగా మార్చుకొని ఓ వ్యక్తి దర్జాగా వ్యాపారం సాగిస్తున్నాడు. ఈ ఘటన మర్రిపాడు మండలం పోలిరెడ్డిపల్లి గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల పక్కన గతంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఓ వ్యక్తి దుకాణంగా మార్చుకొని వ్యాపారం సాగిస్తున్నాడు. అధికారులు చర్యలు తీసుకొని దుకాణాన్ని తొలగించి వాటర్ ప్లాంట్ ను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.