మహిమలూరు ప్రాథమిక కేంద్రం ఎదుట వైద్య సిబ్బంది నిరసన

67చూసినవారు
మహిమలూరు ప్రాథమిక కేంద్రం ఎదుట వైద్య సిబ్బంది నిరసన
ఆత్మకూరు మండలం మహిమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని పి. అనూష కుమారి ఆధ్వర్యంలో ప్రాథమిక కేంద్రం ఎదుట వైద్య సిబ్బంది శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. కలకత్తాలోని వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు కోరారు. మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. ప్రాణాలు పోసే డాక్టర్ల ప్రాణాలు తీయడం దారుణం అన్నారు.

సంబంధిత పోస్ట్