భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో శుక్రవారం ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 17వ తేదీ వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ విచ్చేయుచున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లపై వెంకయ్య నాయుడు తో మంత్రి ఆనం చర్చించారు.