చేజర్లలో మొక్కలు నాటిన ఎన్డీఏ కూటమినేతలు

52చూసినవారు
చేజర్లలో మొక్కలు నాటిన ఎన్డీఏ కూటమినేతలు
రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బుధవారం చేజర్ల గ్రామ పంచాయతీలో సొసైటీ అధ్యక్షులు బూధల్ల వీర రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్డీఏ కూటమినేతలు ఆనం రామనారాయణ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గుండాల విజయ భాస్కర్ రెడ్డి, నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్