ఆత్మకూరు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్నిశాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.