నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ప్రమాదం తృటిలో తప్పింది. వడ్ల బస్తాలు లోడుతో నెల్లూరు వైపు వెళ్తున్న లారీ, టోల్ వద్దకు రాగానే బస్తాలు టోల్ బూత్‌ను ఢీకొన్నాయి. దీంతో బూత్ పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమయంలో అక్కడ సిబ్బంది లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. టోల్ లైన్లు ఇరుకుగా ఉండటం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి.