ఆత్మకూరు ప్రజలకు ఇక లో వోల్టేజ్ సమస్య ఉండదు

54చూసినవారు
ఆత్మకూరు ప్రజలకు ఇక లో వోల్టేజ్ సమస్య ఉండదు
ఆత్మకూరులో ఇక లో వోల్టేజ్ సమస్య ఉండదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల పలు ప్రాంతాలలో లోవోల్టేజ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. మరమ్మత్తులు చేపట్టిన విద్యుత్ శాఖ అధికారులు పట్టణంలోని 7 చోట్ల విద్యుత్ కెపాసిటీ 63 కేవి నుంచి 100 కేవికి పెంచారు. దీని ద్వారా ఇక విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్