ఆత్మకూరు పట్టణంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 8: 30 నుండి 11 గంటల వరకు ఆత్మకూరు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును అని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 33/11 కెవిఎస్ఎస్ ఎటిఎమ్ ఎటిసిబిలో కొత్త విసిబి యొక్క మరమ్మత్తుల పని కారణంగా సరఫరా అంతరాయం ఉండునని వినియోగదారులు దయచేసి సహకరించాలని ఆత్మకూరు పట్టణ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ షేక్ జమీల బేగం కోరారు.