చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి గ్రామంలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో ఈరోజు ముందస్తు విజయదశమి వేడుకలు జరిగాయి. స్కూల్ కరస్పాడెంట్ లక్ష్మి నరసారెడ్డి పర్యవేక్షణలో విద్యార్థులు భరతనాట్యం, దుర్గామాత వేశాధారణ, రావణ దహనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా విద్యార్థులలో భక్తి భావన పెంపొందించడమే లక్ష్యం అని కరస్పాడెంట్ తెలిపారు.