భక్తులకు ప్రవచనాలు వినిపించిన అర్చకులు

66చూసినవారు
భక్తులకు ప్రవచనాలు వినిపించిన అర్చకులు
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పరిధిలోని సోమశిల గ్రామంలో ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత సాయిబాబాకు అభిషేకం, ప్రత్యేక పూజలు, కాగడాల హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు ప్రవచనాలను వినిపించారు. గురు పౌర్ణమి యొక్క విశిష్టతను తెలియజేశారు. భక్తులు స్వామి వారికి నైవేద్యాలు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్