నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నూతన డిప్యూటీ తహసిల్దార్ గా ఆర్. మస్తానయ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ సమస్యలపై ప్రజలు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. కాగా ఆయన బాలాయపల్లిలో విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా చేజర్ల వచ్చారు.