సోమశిల జలాశయం సమీపంలోని సోమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.8 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల శంకుస్థాపన చేశారు. పూర్వ వైభవం పునరుద్ధరానికి ప్రభుత్వం కృషి చేస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.