సంగం మండలం కోలగట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మంత్రి మమేకమయ్యారు. కొన్ని కుటుంబాల్లో ప్రజలు తెలిపిన చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలిచ్చి పరిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో సుపరిపాలన అంటే ఏమిటో చేసి చూపిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు.