నెల్లూర్ జిల్లా సంగంలో అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం జరిగింది. అధికారుల సమక్షంలో సంగం కొండ వద్ద గుంత తొవ్వి ఆ యెక్క వ్యర్థాలను పూడ్చి వేయడం జరిగింది. అవి తరలిస్తున్న వాహనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. అలాగే అధికారులు మాట్లాడుతూ చేపల చెరువులలో చికెన్ వ్యర్ధాలు వేస్తే చర్యలు తీసుకోవడం ఖచ్చితమని హెచ్చరించారు.