నెల్లూరు జిల్లా సంగం మండల వ్యవసాయ అధికారిగా శశిధర్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంఘంలోని వ్యవసాయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ మండలంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తానని తెలిపారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా వచ్చి తనకు తెలపాలని సూచించారు.