నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామంలో ఉన్న శ్రీ ఇంద్రాక్షి అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్కంధ హోమం, లక్ష్మీ గణపతి హోమం, ఇంద్రక్ష హోమం నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్య పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.