అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటి ప్రవాహం తగ్గింది. జలాశయంలో శనివారం ఉదయం ఆరు గంటల నాటికి 10. 119 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుండి జలాశయానికి 384 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.