సోమశిల: వృద్ధుల కోసం నిర్వహించే సెర్చ్ ఆపరేషన్ నిలిపివేత

22చూసినవారు
సోమశిల: వృద్ధుల కోసం నిర్వహించే సెర్చ్ ఆపరేషన్ నిలిపివేత
సోమశిల అటవీ ప్రాంతంలో ఉన్న మల్లెంకొండ స్వామి ఆలయానికి వెళ్లి ఇద్దరు వృద్ధ అన్నదమ్ములు అదృశ్యమైన విషయం తెలిసిందే. మంత్రి ఆనం, ఎస్పీ ఆదేశాలతో అప్పటినుంచి పోలీసులు విస్తృతంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహించినప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. కాగా వారు తప్పిపోయి వారం దాటుతుండడంతో సమీప లోయలలో పడి చనిపోయి ఉంటారని కావున సెర్చ్ ఆపరేషన్ నిలిపివేస్తున్నట్లు ఆత్మకూరు ఫారెస్ట్, పోలీస్ అధికారులు ఆదివారం తెలిపారు.