నెల్లూరు జిల్లా సంఘం పట్టణంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, అష్టోత్తరాలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.