సైబర్ నేరగాల్ల ఉచ్చులో నెల్లూరు జిల్లాలోని ఓ తహసిల్దార్ చిక్కుకున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తహసిల్దార్ వెంకటరమణకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు బెదిరించారు. 5 లక్షలు ఇవ్వకపోతే వివరాలను బయట పెడతామని హెచ్చరించడంతో ఆయన రూ. 3 లక్షల 50 వేలు ఇచ్చారు. దీనిపై అనుమానం వచ్చి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.