నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు పట్టణ పరిధిలోని పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై సభ్యత్వ నమోదుపై మంత్రి అన్నం దిశా నిర్దేశం చేశారు. అలాగే తన కుమార్తె లీలా కైవల్య, కుమారుడు ఆనం శుభకర్ రెడ్డి, అన్న ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు ఆనం రంగమయ్యకి పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యమని మంత్రి ఆనం అన్నారు.