సంఘం మండల కేంద్రంలో దారుణ పరిస్థితి

67చూసినవారు
సంఘం మండల కేంద్రంలో దారుణ పరిస్థితి
సంఘం పట్టణంలోని రోడ్డు పక్కన ఉండే మురికి కాలువలు చాలా అద్వానంగా మారాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన మురికి కాలువలలో నీరు, చెత్త చెదారం పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికంగా ఉండే ప్రజలతో పాటు ప్రయాణికులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మురుగునీరు కాలువల్లో నుంచి పొంగి రోడ్లపైకి రావడం మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్