నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గండ్లవేడు చెరువులోకి కొంత భాగాన్ని వింజమూరు మండలం చంద్ర పడియా గ్రామానికి చెందిన వేమూరి భాస్కర్ నాయుడు అనే వ్యక్తి ఆక్రమించాడని గ్రామస్తులు ఆరోపించారు. శనివారం గ్రామస్తులు మాట్లాడుతూ. అతని పొలానికి ఆనుకుని ఉన్న సుమారు 10 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ట్రాక్టర్లతో మట్టి తోలించాడన్నారు. అధికారులు స్పందించి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.