ఏఎస్ పేట మండలం హసనాపురం గ్రామంలో అట్టహాసంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఆదివారం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, ప్రజల నుండి సమస్యలను టిడిపి నేతలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, కాటం రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.