వరికుంటపాడు: యధేచ్ఛగా గ్రావెల్ రవాణా

85చూసినవారు
వరికుంటపాడు: యధేచ్ఛగా గ్రావెల్ రవాణా
వరికుంటపాడు మండలంలోని విరువూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని ఆవులు బీడు సమీపంలో కొంతమంది అక్రమార్కులు మట్టిని ప్రకాశం జిల్లా పామూరు ప్లాట్ లకు తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం పశు పెంపకదారుడు అటుగా వెళుతుండగా మట్టి తవ్వకాలను గమనించిన ఆ వ్యక్తి గ్రామస్తులకు సమాచారం అందించాడు. కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకొని మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్