నెల్లూరు జిల్లా సంగం సీఐ రవి నాయక్ బదిలీ కావడంతో. సంగం నూతన సీఐగా వేమారెడ్డిని నియమించారు. సీఐ వేమారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా నుంచి ఆయన బదిలీ పై ఇక్కడికి వచ్చారు. నేర నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ పేర్కొన్నారు. ఎస్సై, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు.