కావలి, దగదర్తి, ఆత్మకూరు, మర్రిపాడు, తదితర ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచి తీవ్ర ఎండగా ఉండి, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు జరిగాయి. వర్షం పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా గత 20 నిమిషాల పాటు భారీ ఈదురు గాలులు కూడా పలు గ్రామాల్లో వీచాయి. మూడు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాల వల్ల మనుబోలు మండలంలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు.