హాస్టల్స్ లో ఆహారం సరఫరాలో ఎక్కడైనా అవకతవకలు జరుగుతుంటే ప్రజలు ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ 9490551117కి వీడియోల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల హాస్టల్స్ ను ఆయన బుధవారం తనిఖీ చేశారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్, బీసీ బాలికల హాస్టల్ స్టోర్ రూమ్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు.