మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థినులకు గూడూరు టూ టౌన్ సీఐ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. శుక్రవారం గూడూరు రెండో పట్టణంలోని మినీ గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు ఆయన పలు అంశాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు మహిళల అపహరణ గాంజా డ్రగ్స్ వినియోగంపై ఆయన వివరించారు. అలాగే సైబర్ నేరాలు పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై కూడా ఆయన పలు సూచనలు సలహాలు అందించారు.