గూడూరు మండలం విందూరు, రామలింగాపురం గ్రామాల్లోని దళిత కాలనీలలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాల కోసం ఇళ్లులేని నిరుపేదలకు దరఖాస్తులు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్. ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఎంబేటి చంద్రయ్య గ్రామస్థులు పాల్గొన్నారు.