గూడూరు రూరల్ మండల పరిధిలోని 197 మంది లబ్ధిదారులకు నూతన ఇళ్ల పట్టాలు మంజురా అయినట్టు స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. మంజూరైన లబ్ధిదారులకు శనివారం ఎమ్మార్వో కార్యాలయం నందు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.