గూడూరు ప్రభుత్వ పాలటెక్నిక్ కాలేజ్ నందు జరుగుతున్న 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ను గురువారం గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ ప్రారంభించారు. 800 మీటర్ల రన్నింగ్ లో గెలుపొందిన బాలికలకు బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు.