గూడూరు పట్టణంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో పలు ప్రదేశాలలో మొక్కలు నాటారు. అనంతరం బీట్ ది హిట్ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని సి వి జి పార్కులో పక్షుల పరిరక్షణ కోసం చిరుధాన్యాలు తాగు నీటిని ఏర్పాటు చేశారు.