తిరుపతి జిల్లా కోట మండలం కోట, విద్యానగర్ లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు చేపట్టారు. ఆయా ప్రాంతాలలోని ఎక్స్ ట్రా మార్ట్, ఎక్స్ ట్రా బేక్స్ బేకరీలు, హోటళ్ల, ధాబాలలో ఏకకాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో భారీగా కాలం చెల్లిన, బూజు పట్టిన ఆహార పదార్ధాలు, తినుబండారాలను గుర్తించారు. అలాగే నిల్వ ఉన్న మాంసాహార వంటలు, కల్తీ నూనె ను స్వాధీనం చేసుకున్నారు.