రహదారి భద్రత నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని గూడూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి బి. ఎస్. కె కిషోర్ కోరారు. గురువారం గూడూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు రహదారి భద్రత మాసోత్సవాలను పరిష్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.