గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుతూ గూడూరు పట్టణంలోని షాదీమంజిల్ లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాల్సిన ఆవశ్యకతను వక్తలు వివరించారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు, దళిత సంఘాలు, మైనారిటీ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు అందించారు.