తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు గ్రామంలో గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. ఆయన మాట్లాడతూ.. ప్రజలు తమ భూ సమస్యలపై అర్జీలను సమర్పించాలని కోరారు. పలు సమస్యలపై వచ్చిన అర్జీలను తహశీల్దార్ రామయ్య, ఎంపీడీవో అన్నపూర్ణ రావు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్, వీఆర్వో హరిబాబు తదితరులు పాల్గొన్నారు.