గూడూరు టిడ్కో ఇళ్లల్లో ఆదివారం రూరల్ పోలీసులు ఒక్కసారి ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణానికి దూరంగా టిడ్కో గృహాలు ఉండడంతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నారా మాదక ద్రవ్యాల రవాణా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే కోణంలో ప్రతి ఇళ్ళను పరిశీలించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఓ కారు, 9బైకులను సీజ్ చేశామని రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ వెల్లడించారు.