చిల్లకూరు మండలంలోని శ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పుష్ప అలంకరణ, వరలక్ష్మి వ్రతం కార్యక్రమాలు జరిగాయి.