తిరుపతి జిల్లా గూడూరు పరిసర ప్రాంతాల్లో మంగళవారం వేకువజామున నుండి దట్టమైన పొగ మంచు కప్పేసింది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులకు గురయ్యారు. పొగ మంచు కారణంగా ఎదురెదురు వాహనాలు కనిపించకుండా పోవడంతో హెడ్లెట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. అలాగే చలి తీవ్రత పెరగడంతో ఈ పొగ మంచు ప్రజలకు ఇబ్బందులకు గురిచేసింది.